సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఇవాళ సచివాలయం లో సాయంత్రం 4 గంటలకు కేబినేట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఐదు డీఏతో పాటు, వారి సమస్యలపై చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి రెండు రోజుల క్రితం తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు డీఏపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా జీవో నెం.317 అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇక మూసీ బాధితులకు ఇచ్చే పరిహారంపై కూడా మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. బీసీ కుల గణన, కొత్త ఆర్వోఆర్ చట్టం పై కూడా ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హైడ్రాకు చట్టబద్ధతతో పాటు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ అధికారాలు ఇటీవలే హైడ్రాకు కట్టబెడుతూ పురపాలక శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ యాక్ట్ చట్ట సవరణ బిల్లు కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇందిరమ్మ ఇళ్ల కమిటీ లు, కొత్త రేషన్ కార్డు అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు రైతు భరోసా స్కీమ్ పై కేబినెట్ చర్చించనుంది. విధివిధానాలను ఖరారు చేసే అంశంపై సమాలోచనలు చేయనుంది. నెలాఖరు లోపు ఇప్పటి వరకు రుణమాఫీ కాని రైతులకు స్కీమ్ వర్తింపజేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ భేటీలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- డేంజర్ లో హైదరాబాద్ …కొన్ని రోజులుగా వాతావరణంలో మీకు మార్పు గమనించారా . జలుబు ,దగ్గు ,తుమ్ములు వంటి సమస్యలు మీకు ఎదురయ్యాయా ?అసలు ఏం జరుగుతుందో తెలుసా.. మనం ప్రమాదంఅంచుల్లో పడిపోతున్నాం.. వెంటనే అప్రమత్తం అవ్వండి. కాలుష్యానికి బ్రాండ్ గా ఉన్నఢిల్లీ…
- శివనామస్మరణతో మార్మోగుతున్న ద్రాక్షారామంకార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే మహిళలు గోదావరి నదిలో స్థానం ఆచరించి అరటి దొప్పలతో దీపాలు…
- నెరవేరనున్న ఏపీ ప్రజల చిరకాల వాంఛరైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యకలాపాల కోసం భవనాల నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది. జోన్…
- విజయవాడ మేయర్ కు పదవీ ముప్పువిజయవాడ నగరపాలక సంస్థలో మేయర్ కు పదవీ ముప్పు తప్పేలా లేదు. ఎన్నికలకు ముందు నగరపాలక సంస్థలో 49 మంది కార్పొరేటర్లతో ఉన్న వైసీపీ బలం ప్రస్తుతం 38కి తగ్గిపోయింది. వీరిలోనూ మరో 10 మందికిపైగా కూటమి పార్టీల…
- ఆదాయాన్ని పెంచడానికి .. సామాన్యులపై రోడ్ టాక్స్ భారంపెట్రల్, డీజిల్ తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్ ట్యాక్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో వాహనాల ద్వారా వస్తున్న ఆదాయం, రిజిస్ట్రేషన్ విధానం తదితర అంశాలపై రాష్ట్ర రవాణా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి