SR జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చిగుళ్ల సురేష్ , వయస్సు:39 సం||లు ,స్వస్థలం:హన్మకొండ. తను ఉంటున్న గది( బుద్ధ నగర్) లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా సమయంలో వరంగల్ నందు SPR జూనియర్ కళాశాల పెట్టి ఆర్థిక ఇబ్బందులు రావడంతో అట్టి కళాశాలను మూసి వేసి ప్రస్తుతం ఒంటరిగా ఉంటు ఈ రోజు ఉదయం చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకొని హన్మకొండ నుండి వచ్చిన బార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. గత ఆరు నెలల నుండి SR కళాశాలలో పనిచేస్తున్నాడు.
Warangal
బంగాళా ఖాతం లో ఏర్పడిన తీవ్ర తూఫాన్ ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబబాద్, సూర్యాపేట తదితర జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.ఎస్. శాంతి కుమారి మాట్లాడుతూ, నేడు, రేపు రెండురోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటొకాల్స్ కు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖ లు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వె, లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని సి.ఎస్ శాంతి కుమారి సూచించారు.
Read Also..
Read Also..
వరంగల్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. భూపాలపల్లి, జయశంకర్, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా వరి, పత్తి పంటలకు నష్టం చేకూరనుంది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.
హన్మకొండ జిల్లా, అంబేద్కర్, జితేందర్ సింగ్ నగర్ లో పదేండ్ల క్రితం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి స్థానిక గుడిసె వాసులు. 200మంది గుడిసే వాసులు వెళ్లేందుకు సిద్ధం. గుడిసె వాసులతో పోలీస్ చర్చలు. ప్రెస్ క్లబ్ సమీపంలో రోడ్డు పై బైటయించిన గుడిసె వాసులు. డబుల్ బెడ్ రూమ్ పరిసరాలలో భారీగా పోలీసుల మోహరింపు.
ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస అభ్యర్థి సీతక్క ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై 33700 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గెలుపు అనంతరం సీతక్క ఎక్స్ వేదికగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం ప్రజలదని వ్యాఖ్యానించారు. 200 కోట్ల కేసీఆర్ డబ్బును ఓడించిందిన తాను కాదని, ప్రజలని పేర్కొన్నారు. ఎన్నికల తరువాత ములుగు నుంచి సీతక్క మేడారానికి వెళ్లి సారలమ్మను దర్శించుకున్నారు. ఈ క్రమంలో అడుగడుగునా ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాగా, ఈ ఎన్నికల్లో సీతక్కకు 102267 పోలవగా బీఆర్ఎస్ నేత బడే నాగజ్యోతికి 68567 ఓట్లు వచ్చాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధం
12 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కు ఐదు ప్రాంతాల్లో ఏర్పాట్లు
1- వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో 5 నియోజకవర్గాల లెక్కింపు -వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కోసం 23 టేబుల్స్ ఏర్పాటు.
14 టేబుల్ లలో ఈవీఎం ఓట్ల లెక్కింపు జరగనుండగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 9 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 24 రౌండ్ లలో లెక్కింపు పూర్తవుతుంది.
పరకాల, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల ఓట్లు లెక్కింపు కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి 17 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు జరగనుండగా మూడు టేబుల్స్ లో పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు జరగనుంది.
2- ములుగు కలెక్టర్ కార్యాలయం అవరణలో ములుగు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు.
మొత్తం 17 టేబుల్స్ ఏర్పాటు చేయగా 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు మూడు టేబుల్స్ లో పోస్టల్ ఓట్ల లెక్కింపు జరుగనుంది. 22 రౌండ్ల తర్వాత తుది ఫలితం వస్తుంది.
3- భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియం పక్కన ఉన్న సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో భూపాలపల్లి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు.
మొత్తం 17 టేబుల్స్ ఏర్పాటు చేయగా 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు మూడు టేబుల్స్ లో పోస్టల్ ఓట్ల లెక్కింపు జరగనుంది. 23 రౌండ్ల లో లెక్కింపు పూర్తవుతుంది.
4- జనగామ పెంబర్తి వీబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ లో మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు
(జనగామ, స్టేషన్గన్పూర్, పాలకుర్తి)
ఒక్కొక్క నియోజకవర్గానికి 17 టేబుల్ ఏర్పాటు. 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు, మూడు టేబుల్స్ లో పోస్టల్ ఓట్ల లెక్కింపు జరగనుంది. 18 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.
5- మహబూబాద్ టౌన్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల భవనంలో మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు.
ఎక్సైజ్ సీఐ కొడుకు నిర్లక్ష్యం ఒక మహిళ నిండు ప్రాణాలను బలి తీసుకుంది. హనుమకొండ జిల్లా ఖాజీపేటలో ఈ ఘటన జరిగింది. స్థానిక ఫాతిమానగర్కు చెందిన మహిళ స్కూటీ ఎక్కుతుండగా వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాద సమయంలో ఎక్సైజ్ సీఐ శరత్ కుమారుడు వంశీ కారును నడుపుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల నుంచి తమ ఫిర్యాదును తీసుకోవడం లేదంటూ ఫాతిమానగర్ జంక్షన్లో ధర్నా చేపట్టారు. భారీగా ట్రాఫిక్ జాం కాగా.. పోలీసులు తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని వారు తేల్చిచెప్పారు.
హనుమకొండ జిల్లా కాజిపేట్ లో నిన్న గ్యాబ్రియల్ స్కూల్ నుండి బయటికి వచ్చి బైక్ ఎక్కుతున్న కవితను కారు ఢీకొట్టింది. కారు నెంబర్ TS03 FA9881. మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. కారు ఆక్సిడెంట్ చేసిన వ్యక్తి ఎక్సయిజ్ సిఐ శరత్ కొడుకు వంశీ. నిన్నటి నుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న తమకు న్యాయం చేయడం లేదని మృతురాలి బంధువుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ అధికారి కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, కవిత బంధువులు మరియు స్నేహితులును తిట్టి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్లగొడుతున్నారు. తమకు న్యాయం చేయాలని ఫాతిమా నగర్ జంక్షన్లో ధర్నా చేపట్టారు.
ములుగు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. జిల్లాలో 303 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల మెటీరియల్ సిబ్బందికి అందజేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అంకిత్ కుమార్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందజేశారు. ఎజెన్సీ ప్రాంతాలలో అవసరమైన మేర సెక్టార్ అధికారులను నియమించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సిబ్బందికి ఈవీయం యంత్రాలు, వివి ప్యాడ్ లను అందించారు.ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సజావుగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.






Total views : 151106