భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, కొత్తూరు గ్రామంలో త్రాగునీరు సరఫరా లేదంటూ ఖాళీ బిందెలతో గ్రామస్తులు రోడ్డెక్కారు. గత నాలుగు నెలలుగా మిషన్ భగీరథ మోటర్లు పనిచేయక నీటి సరఫరా లేక త్రాగునీరు కోసం ఇబ్బంది పడుతున్న ఏ అధికారి తమ వంక చూడలేదని ఆగ్రహంతో ధర్నాకు దిగారు. రోడ్డుపై టెంట్ వేసి రోడ్డుకి అడ్డంగా కర్రలు పెట్టి మహిళలు ధర్నాకి దిగడంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వేసవి రాకముందే ఇన్ని ఇక్కట్లు ఉంటే వేసవిలో మరింత ఇబ్బంది ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికార యంత్రాంగం స్పందించి త్రాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్య తీరేవరకు ధర్నా విరమించేది లేదని గ్రామస్తులు తెలుపుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగడం ఖాయం..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి