2004లో రావాల్సిన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బూర్గంపాడులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ఓటు వేయడానికి ముందు అభ్యర్థులు, పార్టీల మంచి, చెడును, గుణాన్ని చూడాలన్నారు. అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్ర, వాటి నడవడిక, అధికారమిస్తే ఏం చేస్తారు? పేదలు, రైతుల పట్ల వారి తీరు ఎలా ఉంది? అని ఆలోచించాలని సూచించారు. అలా చూస్తేనే నాయకుడు గెలవడం కంటే ప్రజలు గెలుస్తారన్నారు. తెలంగాణ వచ్చాక మొదటిసారి ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, ఆ సమయంలో కరెంట్ సమస్య ఉండేదని, ఇప్పుడు దానిని పరిష్కరించుకున్నామన్నారు. కులం, మతం భేదం లేకుండా అందర్నీ సమానంగా చూస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. అందుకే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
తెలంగాణ ఆలస్యం అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే – కేసీఆర్
76
previous post