మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం బాదేపల్లి ఎర్రగుట్ట కాలనీలో నిరుపేదలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్వాధీనం చేసుకోవటం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టారు. ఎర్రగుట్ట కాలనీ గత ప్రభుత్వం 560 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించింది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేశారు. అయితే లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందజేయలేదు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దీంతో ఇళ్లు తమకే చెందుతాయంటూ నిరుపేదలు ఒక్కసారిగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు వెళ్లి తాళాలు విరగగొట్టి కొత్త తాళాలను వేసుకొని ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. ఎన్నో ఏళ్లుగా తాము గుడిసెల్లో జీవిస్తున్నామని ఇల్లు లేని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also..