65
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల అలజడి మరింత పెరిగింది. ఇటీవల ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో దారుణానికి ఒడిగట్టారు. బారాముల్లాలోని ఓ మసీదులో రిటైర్డ్ పోలీసు అధికారి మహమ్మద్ షఫీ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, తీవ్ర గాయాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారని కాశ్మీర్ జోన్ పోలీసులు ఇవాళ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇప్పటికే లోయలో ఆర్మీ, పోలీసులు, కేంద్ర పోలీస్ భద్రతా బలగాలు ఉగ్రవాదుల సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. కాగా, ఈ ఘటనతో అధికారులు మరింత పటిష్టంగా తనిఖీలు చేపట్టారు.