హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 436 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ పై 190 పరుగుల భారీ ఆధిక్యతను సాధించింది. టీమిండియా బ్యాట్స్ మెన్లలో జడేజా 87, కేఎల్ రాహుల్ 86, యశస్వి జైశ్వాల్ 80, అక్సర్ పటేల్ 44, శిఖర్ భరత్ 41 పరుగులు సాధించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 24 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోరూట్ 79 పరుగులు ఇచ్చి 4 వికెట్లను కూల్చాడు. రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ చెరో రెండు వికెట్లను తీయగా జాక్ లీచ్ ఒక వికెట్ పడగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ రనౌట్ అయ్యాడు. బ్యాటింగ్ లో రాణించిన జడేజా, అక్సర్ పటేల్ బౌలింగ్ లో కూడా రాణించారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో జడేజా 3, అక్సర్ పటేల్ 2 వికెట్లు తీశారు. మరోవైపు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 246 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.\
ఇంగ్లాండ్ తో టెస్టు.. టీమిండియా ఆలౌట్
72
previous post