మహిళలు స్వశక్తితో ముందుకు సాగేలా ప్రభుత్వం నిర్ణయాలు..

మహిళలు స్వశక్తితో ముందుకు సాగేలా ప్రభుత్వం నిర్ణయాలు

Advertisements

<p>మహిళలు స్వశక్తితో ముందుకు సాగేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి&period; మహిళా వారోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 8 వేల ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు&period; మహిళా సంఘాలకు ఇప్పటి వరకు రూ&period;60 వేల కోట్లకు పైగా రుణాలు అందించామని&comma; వడ్డీ లేని రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని చెప్పారు&period; బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు&period; బ్యాంక్ లోన్ల చెల్లింపులో నిర్మల్ జిల్లా మహిళా సంఘాలు తొలి స్థానంలో ఉన్నాయని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు&period; 29 నెలల్లో పది వేల కోట్ల రూపాయలకుపైగా ఉచిత బస్సు పథకం కోసం ఆర్టీసీకి చెల్లించామన్నారు&period; మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలని గిట్టని వాళ్లు ప్రయత్నించారని&period;&period; అందుకోసం ఆటో కార్మికులను కూడా రెచ్చగొట్టారని గుర్తు చేశారు&period; మహిళలను బస్సులకు యజమానులు చేయాలనే ఉద్దేశంతో వెయ్యి బస్సులను మహిళా సంఘాలు కొనుగోలు చేసి&period;&period; ఆర్టీసీకి ప్రతి నెలా రూ&period;70 వేల చొప్పున అద్దెకు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు&period; అందులో భాగంగా 553 బస్సులను ఇవాళ అంకితం చేశామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..