తెలంగాణలో పంచాయతీ సిబ్బందికి తీపి కబురు…

మహారాష్ట్ర సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ

Advertisements

<p>రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది&period; సుమారు 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా ఒకటో తారీఖునే జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు&period; ఐఏఎస్ అధికారులకు సమయానికి జీతాలు అందినట్లే&comma; క్షేత్రస్థాయిలో పనిచేసే పంచాయతీ సిబ్బందికీ వేతనాలు అందాలని ఆయన స్పష్టం చేశారు&period;పంచాయతీరాజ్&comma; గ్రామీణాభివృద్ధి శాఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి&comma; పలు కీలక సూచనలు చేశారు&period; గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాల చెల్లింపులో జాప్యం జరగకుండా&comma; ప్రభుత్వం నుంచి ప్రతినెలా 50 కోట్లను ప్రత్యేకంగా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు&period; కేవలం పంచాయతీ సిబ్బందికే కాకుండా&comma; ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని అవుట్‌సోర్సింగ్&comma; కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ నెల మొదటి రోజే జీతాలు అందేలా చూడాలని తేల్చిచెప్పారు&period; సిబ్బంది జీతాల చెల్లింపులో ఒక్కరోజు ఆలస్యమైనా సహించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు&period; గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయంప్రతిపత్తిని బలోపేతం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు&period; గత ప్రభుత్వం గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో జమ చేయాలన్న నిబంధనను రద్దు చేయాలని ఆదేశించారు&period; తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం&comma; 2018లోని సెక్షన్ 70&lpar;3&rpar;కి సవరణలు చేసి&comma; పంచాయతీల సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీకి బదులుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు&period; ఇది పంచాయతీల ఆర్థిక స్వేచ్ఛను పునరుద్ధరించడానికి దోహదపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు&period; పెన్షన్ల పంపిణీ విధానంలోనూ మార్పులు చేయాలని సీఎం ఆదేశించారు&period; ప్రస్తుతం పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్న పెన్షన్లను ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని చెప్పారు&period; ఈ విధానం ద్వారా పారదర్శకత పెరుగుతుందని&comma; అనర్హులను ఏరివేయడం సులభమవుతుందని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..