అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు..

అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు

Advertisements

<p>దేశంలో మారుతున్న జనాభా సమీకరణాలు&comma; వృద్ధి వల్ల ఉత్పన్నమవుతున్న సామాజిక&comma; ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది&period; దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జనాభా మార్పులను సమగ్రంగా అధ్యయనం చేసి&comma; తగిన సిఫార్సులు చేయడం కోసం రిటైర్డ్ జస్టిస్ నావలేకర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కేంద్ర హోంమంత్రి అమిత్ à°·à°¾ ఇవాళ ప్రకటించారు&period; జనాభా మార్పు సమస్య భారతదేశ సార్వభౌమత్వానికి&comma; జాతీయ భద్రతకు&comma; సామాజిక సమతుల్యతకు&comma; ఆదివాసీ సమాజాల పరిరక్షణకు ఒక పెద్ద సవాలుగా మారిందని పేర్కొన్నారు&period; దేశంలో మారుతున్న జనాభా తీరుపై అమిత్ à°·à°¾ ఆందోళన వ్యక్తం చేస్తూ&period;&period; చొరబాట్లను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని పిలుపునిచ్చారు&period; ఇటీవలి కాలంలో దేశంలోని కొన్ని నిర్దిష్ట సరిహద్దు ప్రాంతాలు&comma; రాష్ట్రాల్లో జనాభా సమతుల్యతలో వస్తున్న వ్యత్యాసాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;<p>ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి హోంమంత్రి అమిత్ à°·à°¾ మాట్లాడుతూ&period;&period; దేశం వికసిత భారత్ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో దేశ వనరులు&comma; జనాభా వృద్ధి మధ్య సమతుల్యత ఎంతో అవసరమని పేర్కొన్నారు&period; వేగంగా జరుగుతున్న జనాభా మార్పులు&comma; వాటి వల్ల స్థానిక మౌలిక సదుపాయాలు&comma; సామాజిక భద్రత&comma; జాతీయ భద్రతపై పడే ప్రభావాలను ఈ ఉన్నత స్థాయి కమిటీ లోతుగా పరిశీలిస్తుంది&period; జనాభా నియంత్రణతో పాటు అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందేలా విధానపరమైన సిఫార్సులను ఈ కమిటీ ప్రభుత్వానికి అందించనుందని పేర్కొన్నారు&period; దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జనన రేట్లు&comma; వలసలు&comma; స్థానిక జనాభాలో వస్తున్న మార్పుల డేటాను ఈ కమిటీ నిపుణుల సహాయంతో విశ్లేషించనుంది&period; భవిష్యత్తులో పెరగబోయే జనాభాకు అనుగుణంగా విద్య&comma; వైద్యం&comma; ఉపాధి అవకాశాల కల్పనకు ఎలాంటి వ్యూహాలు అవసరమో కేంద్ర ప్రభుత్వానికి రోడ్‌మ్యాప్ అందించనున్నట్లుగా తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో&comma; అంతర్గత భద్రతా వ్యవహారాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీ వలసదారులకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కఠిన హెచ్చరికలు జారీ చేశారు&period; అక్రమ చొరబాటుదారులను ఏరిపారేసే చర్యలను ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశిస్తూ&period;&period; బంగ్లాదేశీ చొరబాటుదారులు ఎవరైనా ఉంటే వేగంగా ఇక్కడి నుంచి పారిపోండి&period; మిమ్మల్ని జైళ్లలో పెట్టి&comma; మా ప్రజాధనంతో తిండి పెట్టి పోషించడం మాకు ఎంతమాత్రం ఇష్టం లేదు&period; మా డబ్బును ఎందుకు వృథా చేయాలి&quest; అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు&period;<&sol;p>&NewLine;<p>బీజేపీ ప్రధాన ఎన్నికల హామీలలో ఒకటైన అక్రమ వలసదారుల ఏరివేతపై ఇప్పుడు సువేందు సర్కార్ పూర్తిస్థాయిలో యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేస్తోంది&period; రాష్ట్రవ్యాప్తంగా చొరబాటుదారులను గుర్తించి&comma; వారిని నిర్బంధించడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది&period; అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులతో పాటు రోహింగ్యాలను కూడా కచ్చితంగా గుర్తించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి&period; ఈ మేరకు బెంగాల్‌లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లిఖితపూర్వక మార్గదర్శకాలు జారీ అయ్యాయి&period; నిర్బంధ కేంద్రాల ఏర్పాటు కోసం అనువైన స్థలాలను తక్షణమే అన్వేషించాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..