తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త..

తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త

Advertisements

<p>తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది&period; ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాల్లో ఇకపై ప్రతిసారి ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించాల్సిన అవసరం లేకుండా &OpenCurlyDoubleQuote;మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు” జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది&period; జూన్ 2à°¨ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు&period;ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణాల కోసం మహిళలు ప్రతి సారి ఆధార్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపించాల్సి వస్తుండగా… ఇకపై ఆ అవసరం తగ్గనుంది&period; &OpenCurlyDoubleQuote;మహాలక్ష్మి స్మార్ట్ కార్డు” ద్వారా కేవలం కార్డు స్కాన్ చేస్తే సరిపోతుంది&period;<&sol;p>&NewLine;<p>ఈ పథకాన్ని తొలుత ప్రయోగాత్మకంగా జిల్లాకు ఒక మండలంలో ప్రారంభించి&period;&period; అక్కడ ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు&period; అర్హులైన మహిళలు సమీప బస్ పాస్ కేంద్రాలు లేదా మీ సేవా కేంద్రాల్లో రూ&period;50 నామినల్ ఫీజుతో ఈ కార్డులను పొందవచ్చు&period;స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వచ్చే వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న విధంగానే ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులతో ఉచిత ప్రయాణం కొనసాగుతుంది&period; ఈ విధానం వల్ల కండక్టర్ల తనిఖీ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు మహిళలకు కూడా మరింత సౌకర్యం కలగనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..