కరీంనగర్ జిల్లా రాంపూర్ రైతులకు ప్రాణభయంగా హైటెన్షన్ తీగలు.

కరీంనగర్ జిల్లా రాంపూర్ రైతులకు ప్రాణభయంగా హైటెన్షన్ తీగలు

Advertisements

<p>కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో రైతుల ప్రాణాలకు ముప్పుగా మారిన విద్యుత్ హైటెన్షన్ తీగలు ఆందోళన కలిగిస్తున్నాయి&period; వ్యవసాయ భూములపై ప్రమాదకరంగా తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగల కారణంగా రైతులు ప్రాణభయంతో పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది&period; పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;ప్రస్తుతం పొలం దున్నడం&comma; వరి నాట్లు వేసే పనులు జోరుగా సాగుతున్న వేళ ట్రాక్టర్లు&comma; హార్వెస్టర్లు&comma; ఇతర ఆధునిక వ్యవసాయ యంత్రాలను పొలాల్లోకి తీసుకెళ్లడం కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు&period; ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో వ్యవసాయ పనులు చేస్తున్నామని అంటున్నారు&period;ముఖ్యంగా రాత్రి వేళల్లో పొలాల్లో పనిచేసే సమయంలో భయం మరింత పెరుగుతోందని చెబుతున్నారు&period; ఈ పరిస్థితుల్లో కూలీలు కూడా పనులకు రావడానికి వెనుకాడుతున్నారని పేర్కొంటున్నారు&period;ఈ సమస్యపై గత ఆరు నెలలుగా విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు&period; ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే బదులు&comma; ముందస్తుగా చర్యలు తీసుకుని విద్యుత్ తీగలను సురక్షితమైన ఎత్తుకు మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు&period;అయితే&comma; ఈ అంశంపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించగా&comma; సమస్యపై సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని&comma; త్వరలోనే తగిన చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని ఫోన్ ద్వారా వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.