ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు

Advertisements

<p>తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు అందించారు&period; గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు&period; ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా ఆర్టీసీ పురోగతి&comma; భవిష్యత్ కార్యాచరణపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు&period; ఆర్టీసీ ఉద్యోగులకు జులై 1 నుంచి 11 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు&period; 2023-26 మధ్య కాలంలో 1&comma;078 కోట్ల వ్యయంతో 2 వేల 815 నూతన బస్సులను కొనుగోలు చేసిందని తెలిపారు&period; అలాగే ఏటూరు నాగారం&comma; పెద్దపల్లి ప్రాంతాల్లో రెండు కొత్త డిపోలను మంజూరు చేశామని&period;&period; వేములవాడ&comma; కథలాపూర్ బస్‌స్టేషన్లకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు&period; తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిని ప్రాథమిక వైద్య సేవల స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రిగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు&period; ఆత్మహత్య చేసుకున్న శంకర్ కుటుంబానికి ఉద్యోగుల నుంచి సేకరించిన డబ్బులతో కోటి రూపాయల చెక్కు &comma; ఇంట్లో ఒకరికి ఉద్యోగం &comma; ఇందిరమ్మ ఇల్లు అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.