జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం.

జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం

Advertisements

<p>జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది&period; పాఠశాల పునఃప్రారంభం నేపథ్యంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్&comma; వార్డు సభ్యులు కలిసి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థుల కుటుంబాలకు ఇంటి పన్ను&comma; నీటి పన్ను మినహాయింపు కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు&period;అంతేకాకుండా గ్రామంలోని ప్రతి వార్డు సభ్యుడు ఇంటింటికి వెళ్లి కనీసం పది మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా కృషి చేయాలని నిర్ణయించారు&period; గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామ పాలకవర్గం పేర్కొంది&period; ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్యాల ఎంఈవో జయసింహారావు&comma; పాఠశాల ఉపాధ్యాయుడు హరికృష్ణ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌తో పాటు వార్డు సభ్యులను అభినందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.