ఎల్‌బీ నగర్‌లో తాగునీటి సమస్యపై బీజేపీ ఆందోళన.

ఎల్‌బీ నగర్‌లో తాగునీటి సమస్యపై బీజేపీ ఆందోళన

Advertisements

<p>హైదరాబాద్ లోని ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు జలమండలి హయత్‌నగర్ సీజీఎం కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు&period;ఈ కార్యక్రమానికి బీజేపీ ఎల్‌బీ నగర్ అసెంబ్లీ ఇంచార్జి సామ రంగారెడ్డి నాయకత్వం వహించారు&period; నియోజకవర్గంలోని అనేక కాలనీలు&comma; బస్తీలు&comma; నివాస ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు&period;వారానికి ఒకసారి కూడా సక్రమంగా నీరు అందని పరిస్థితి నెలకొనడంతో ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోందని&comma; దీనివల్ల సామాన్య కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు&period;ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటిని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని&comma; సంబంధిత అధికారులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు విమర్శించారు&period;అనంతరం జలమండలి అధికారులకు వినతిపత్రం అందజేసి&comma; ఎల్‌బీ నగర్ ప్రజలకు నిరంతరాయంగా తగిన మోతాదులో తాగునీటి సరఫరా జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.