హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ భారీ ఆపరేషన్.

హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ భారీ ఆపరేషన్

Advertisements

<p>హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు&comma; మైలార్‌దేవ్‌పల్లి పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు అంతరాష్ట్ర నేరగాళ్లను అరెస్ట్ చేశారు&period; మెహఫిల్ హోటల్ సమీపంలో బాలెనో కారును అడ్డగించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు&period; వారి వద్ద నుంచి 2 నాటు తుపాకులు &comma; 7 సజీవ బుల్లెట్లు&comma; ఒక బాలెనో కారు&comma; 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు&period; స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ సుమారు రూ&period;5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>అరెస్టైన వారిలో హైదరాబాద్ చార్మినార్ కిల్‌వత్ ప్రాంతానికి చెందిన కార్ డీలర్ ముదస్సిర్ హుస్సేన్ అలియాస్ à°·à°¾ బాబా&comma; మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన లారీ డ్రైవర్ అమీర్ ఖాన్ ఉన్నారు&period; à°·à°¾ బాబాపై కర్ణాటకలో డాకోయిటీ&comma; మహారాష్ట్రలో వ్యాపారవేత్త కిడ్నాప్ కేసులు నమోదై ఉండగా&comma; అమీర్ ఖాన్‌పై హత్య కేసుతో పాటు పలు నేర కేసులు ఉన్నాయి&period; మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో పెద్ద నేరానికి కుట్ర పన్నుతున్న సమయంలో వీరిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు&period; తుపాకులతో బెదిరించి దారిదోపిడీలకు పాల్పడటం వీరి ప్రధాన నేర కార్యకలాపంగా గుర్తించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.