నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పట్టుకున్న పోలీసులు.

నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పట్టుకున్న పోలీసులు

Advertisements

<p>మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్‌లోని మహేశ్వర ట్రేడర్స్ నుంచి గోలేటికి అక్రమంగా తరలిస్తున్న నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు&period; స్థానిక టోల్ గేట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ అక్రమ రవాణా ఉదంతం వెలుగులోకి వచ్చింది&period; పట్టుబడిన రెండు నకిలీ జెమిని చాయ్ పత్తి బాక్సులను స్వాధీనం చేసుకున్నారు&period; సీజ్ చేసిన నకిలీ టీ పొడిని పోలీసులు తదుపరి దర్యాప్తు కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు&period; నిబంధనలకు విరుద్ధంగా నకిలీ సరుకును సరఫరా చేస్తున్న సదరు మహేశ్వర ట్రేడర్స్ షాపు యజమానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు&period; ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతూ ఇలాంటి ఆహార కల్తీకి పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు&period; మార్కెట్లో బ్రాండెడ్ ఉత్పత్తుల పేరుతో చలామణి అవుతున్న నకిలీ వస్తువుల పట్ల వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.

అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.

దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.