సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని చెరువు ఆక్రమణల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సదాశివపేటలో చెరువుల ఆక్రమణలపై బీజేపీ ఆగ్రహం

Advertisements

<p>సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని ఊబ చెరువు&comma; చిన్న చెరువు&comma; పెద్ద చెరువుల ఆక్రమణల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది&period; ప్రభుత్వ భూములు అక్రమ కబ్జాలకు గురవుతున్నాయని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు&period; సీవీఆర్ న్యూస్ ప్రసారం చేసిన కథనాలను ప్రస్తావిస్తూ&comma; చెరువుల భూముల్లో మట్టి పోసి ప్లాట్లు వేయడం&comma; నిర్మాణ సామగ్రిని నిల్వ చేయడం వంటి పనులు బహిరంగంగానే జరుగుతున్నాయని వారు ఆరోపించారు&period; రెవెన్యూ&comma; మున్సిపల్&comma; ఇరిగేషన్ శాఖల అధికారులు ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం బాధాకరమని విమర్శించారు&period; వారం రోజులలోగా ప్రభుత్వం స్పందించి ఆక్రమణలను అడ్డుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని బీజేపీ నేతలు హెచ్చరించారు&period; కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతుండగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు&period; చెరువులను రక్షించి ప్రజల ప్రయోజనాలను కాపాడాలని స్థానిక ప్రజలు&comma; బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని ఊబ చెరువు ప్రస్తుతం ఆక్రమణలతో కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; సర్వే నెంబర్ 399లో ఉన్న ఈ చెరువు మొత్తం 99 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా&comma; ఇప్పటికే దాదాపు 20 ఎకరాలు ఆక్రమణకు గురై ఇళ్ల నిర్మాణాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; ఇదే సమయంలో మరికొంతమంది అక్రమార్కులు మరో 10 ఎకరాల భూమిపై కూడా మట్టి పోసి వెంచర్లుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు&period; చెరువు వైపు రహదారి నిర్మించి మరిన్ని నిర్మాణాలకు మార్గం సుగమం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి&period; ఈ అంశంపై సీవీఆర్ న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసినప్పటికీ ఎమ్మార్వో&comma; మున్సిపల్ కమిషనర్&comma; ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు&period; ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులదేనని&comma; ఆక్రమణదారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులతో పాటు స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం..

జాతీయస్థాయి పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి అనుమానస్పద మృతి..

జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..