హైదరాబాద్ మెట్రో రైలుకు భారీ ఊరట ..

హైదరాబాద్ మెట్రో రైలుకు భారీ ఊరట

Advertisements

<p>హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణంలో సరికొత్త అధ్యాయం మొదలైంది&excl; భాగ్యనగర ప్రజా రవాణా ముఖచిత్రాన్ని మార్చేసే అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది&period; హైదరాబాద్ మెట్రోకు ఏకంగా రూ&period;13&comma;600 కోట్ల భారీ రీఫైనాన్సింగ్ లభించింది&period; న్యూఢిల్లీ వేదికగా&period;&period; ఐఆర్‌ఎఫ్‌సీ సీఎండీ మనోజ్ కుమార్ దూబే&comma; తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె&period; రామకృష్ణ రావు సమక్షంలో ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసింది&period;అయితే ఈ డీల్ వెనుక ఉన్న అసలైన మైలురాయి ఏంటంటే&period;&period; లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ నుంచి 100 శాతం యాజమాన్య హక్కులు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ కానున్నాయి&period; అంటే&period;&period; ఇకపై హైదరాబాద్ మెట్రో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని కీలక ప్రజా రవాణా ఆస్తిగా మారబోతోంది&period;సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నగర రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణ రావు స్పష్టం చేశారు&period; 20 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితితో కుదిరిన ఈ రుణ ఒప్పందం వల్ల మెట్రోపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా&period;&period; భవిష్యత్ విస్తరణ ప్రణాళికలకు విపరీతమైన ఆర్థిక వెసులుబాటు కలగనుంది&period; తద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గి&comma; ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి వసతులు లభిస్తాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.