ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌.

Advertisements

<p>ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ట్రాన్స్‌కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు&period; ఆయన నివాసాలు&comma; కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి&period; ఏసీబీ జరిపిన తనిఖీల్లో వెంకటరమణకు సంబంధించి సుమారు 27&period;65 కోట్ల విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు&period; ఇందులో ప్రధానంగా 10 అపార్ట్‌మెంట్లలో 20 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు లభించాయి&period; 2 కిలోల బంగారం&comma; 52 లక్షల నగదు&comma; 3 ఖరీదైన కార్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు&period; వీటితో పాటు 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా సీజ్ చేశారు&period; ఇక తనిఖీల సమయంలో వెంకటరమణ ఇంట్లో నిబంధనలకు విరుద్ధంగా దాచి ఉంచిన 20 మద్యం బాటిళ్లను ఏసీబీ బృందం స్వాధీనం చేసుకుంది&period; ఆదాయ పరిమితికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టిన కేసు నమోదు చేసి&period;&period; ఆయనపై తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.