సరిహద్దు గ్రామాలు దేశానికి “మొదటి గ్రామాలు” – ప్రధాని మోదీ

Advertisements

<p>సరిహద్దు గ్రామాల అభివృద్ధే దేశ భద్రతకు&comma; సమగ్ర అభివృద్ధికి బలమైన పునాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు&period; వికసిత్ వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్–2026లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని&period;&period; సరిహద్దు గ్రామాలను దేశంలోని చివరి గ్రామాలుగా కాకుండా మొదటి గ్రామాలుగా తమ ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు&period; దేశంలో తొలి సూర్యకిరణం పడేది&comma; చివరి కిరణం వీడ్కోలు చెప్పేది ఈ గ్రామాలకేనని&comma; త్రివర్ణ పతాకం గాలితో తొలిసారి సంభాషించేది కూడా ఈ ప్రాంతాల్లోనేనని పేర్కొన్నారు&period; స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత తొలిసారిగా విద్యుత్&comma; రహదారులు&comma; తాగునీరు&comma; గ్యాస్ కనెక్షన్లు వంటి మౌలిక సదుపాయాలు ఈ గ్రామాలకు చేరాయని చెప్పారు&period; మెరుగైన రవాణా&comma; ఇంటర్నెట్ సౌకర్యాలతో రైతులు&comma; ఉద్యానవన రైతుల ఉత్పత్తులు సులభంగా మార్కెట్లకు చేరుతున్నాయని అన్నారు&period;సరిహద్దు ప్రాంతాల్లో పర్యాటకం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు&period; ఒకప్పుడు వెలవెలబోయిన గ్రామాలు ఇప్పుడు మళ్లీ ప్రజల రాకపోకలతో కళకళలాడుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.