పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం సురక్షితమన్న రేవంత్ రెడ్డి.

Advertisements

<p>పెట్టుబడులకు తెలంగాణ అత్యంత సురక్షితమైన&comma; అనుకూలమైన రాష్ట్రమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు&period; హైదరాబాద్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నార్తర్న్ రీజనల్ కౌన్సిల్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు&period; రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ&comma; పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు&period; నాయకులు&comma; పార్టీలు మారవచ్చు కానీ&comma; గత ప్రభుత్వాలు చేపట్టిన మంచి పనులను మేం కొనసాగిస్తాయని సీఎం స్పష్టం చేశారు&period; మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను&comma; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో బిల్ గేట్స్&comma; బిల్ క్లింటన్ వంటి అంతర్జాతీయ ప్రముఖులను హైదరాబాద్‌కు రప్పించి పెట్టుబడులను ఆకర్షించిన తీరును ఆయన గుర్తుచేశారు&period; కాంగ్రెస్ హయాంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం&comma; ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులు సాకారమయ్యాయన్నారు&period; తద్వారా ఫార్మా ఐటీ రంగాలు మరింత విస్తరించాయని ముఖ్యమంత్రి తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>తమ పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదని&comma; తయారీ రంగంలో చైనా&comma; జపాన్&comma; జర్మనీ వంటి దేశాలతో పోటీ పడుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు&period; నగరాల పరంగా టోక్యో&comma; న్యూయార్క్‌ వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతున్నామని ఆయన అన్నారు&period; వరంగల్&comma; ఆదిలాబాద్‌ విమానాశ్రయాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు&period; కేంద్రం ప్రకటించిన ఏడు బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో మూడు తెలంగాణకు రానున్నాయని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయని&comma; గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు సుమారు 200 కంపెనీలు ముందుకు వచ్చాయని సీఎం తెలిపారు&period; డేటా సెంటర్ల స్థాపన కోసం అమెజాన్ సంస్థ 1 లక్ష కోట్లు&comma; అదానీ గ్రూప్ రూ&period;35&comma;000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు&period; ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీకి ప్రపంచ ప్రఖ్యాత 500 కంపెనీలను తీసుకురావడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.