కామారెడ్డి జిల్లాలో మారిన వాతావరణం..

కామారెడ్డి జిల్లాలో మారిన వాతావరణం

Advertisements

<p>కామారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారింది&period; ఈదురుగాలులు&comma; ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిల్వ చేసిన ధాన్యం తడిసిపోయింది&period; మరోవైపు మండుటెండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది&period; విలీన గ్రామాలైన అడ్లూరు&comma; పాత రాజంపేట&comma; టేక్రియాల్ ప్రాంతాల్లో ఈదురుగాలులు&comma; ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది&period; ఆకస్మికంగా కురిసిన వర్షంతో వరి కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసిన ధాన్యం కుప్పలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు&period;గాంధారి మండలం సర్వాపూర్ గ్రామంలో కూడా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది&period; ధాన్యంపై కప్పిన ప్లాస్టిక్ కవర్లు గాలికి ఎగిరిపోవడంతో వరి ధాన్యం పూర్తిగా తడిసిముద్దైంది&period; సమయానికి కాంటాలు చేయకపోవడం&comma; లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యాన్ని తరలించలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period;గత నెల రోజులుగా మండిపోతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా&comma; ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం కురవడంతో కొంత ఉపశమనం పొందారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.