మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ పీహెచ్‌సీలో డాక్టర్ల కొరత..

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ పీహెచ్‌సీలో డాక్టర్ల కొరత

Advertisements

<p>మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ పీహెచ్‌సీ ప్రస్తుతం ప్రజలకు సరైన వైద్య సేవలు అందించలేక విమర్శలు ఎదుర్కొంటోంది&period; ఇద్దరు రెగ్యులర్ వైద్యులు ఉండాల్సిన ఆసుపత్రిలో ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; తాత్కాలిక ఇంచార్జ్ వైద్యులు కూడా సమయానికి రాకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు&period;ఇటీవల కొత్తపల్లి గ్రామానికి చెందిన బాలు అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో కొత్తగూడ పీహెచ్‌సీకి తరలివచ్చాడు&period; అయితే ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో స్టాఫ్ నర్స్ మమత&comma; ఫార్మసిస్టు ఆయేషాలే ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశారు&period; బాధితుడి పరిస్థితి విషమించడంతో అనంతరం నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు&period; ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; &OpenCurlyDoubleQuote;ప్రభుత్వ దవాఖానల్లో కూడా డాక్టర్లు లేకపోతే పేద ప్రజల ప్రాణాలకు భరోసా ఎక్కడ&quest;” అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు&period; ప్రతి రోజు భయాందోళనల మధ్యే ఆసుపత్రికి రావాల్సి వస్తోందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ స్పందించి కొత్తగూడ పీహెచ్‌సీలో పూర్తి స్థాయి వైద్యులను నియమించాలని&comma; లేకపోతే మరిన్ని ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..