ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బృందం బిజిబిజీ.

Advertisements

<p>ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా కేంద్ర అటవీ&comma; పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిశారు&period; రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు అటవీ&comma; పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు&period; నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి&comma; కాంగ్రెస్ ఎంపీల బృందంతో కలిసి కేంద్రంతో కీలక అంశాలపై చర్చించారు&period; కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో గోదావరి&comma; కృష్ణా నదీ జలాల పంపిణీ&comma; ఏపీలో కొనసాగుతున్న జల వివాదాలు&comma; కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ వంటి కీలక అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది&period;<br &sol;>&NewLine;అభివృద్ధి అంశాలతో పాటు రాజకీయ పరిణామాలు కూడా రేవంత్ ఢిల్లీ పర్యటనకు మరింత ప్రాధాన్యత తెచ్చాయి&period; కేంద్ర మంత్రులతో సమావేశాల అనంతరం కాంగ్రెస్ అధిష్ఠాన నేతలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నట్లు సమాచారం&period; తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణ&comma; మంత్రివర్గ మార్పులపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి&period;<br &sol;>&NewLine;ఇటీవల కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణను విజయవంతంగా పూర్తి చేసిన కాంగ్రెస్ హైకమాండ్&&num;8230&semi; అదే తరహా వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది&period; మంత్రిపదవుల ఆశావహుల అసంతృప్తికి చెక్ పెట్టేలా నిర్ణయాలు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది&period; దీంతో రేవంత్ ఢిల్లీ పర్యటన ముగిసేలోపు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలపై ఉత్కంఠ నెలకొంది&period;<br &sol;>&NewLine;ఒకవైపు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర అనుమతులు&comma; నిధుల కోసం ప్రయత్నాలు&&num;8230&semi; మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానంతో కీలక రాజకీయ చర్చలు&&num;8230&semi; ఇలా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండు కోణాల్లోనూ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది&period; ముఖ్యంగా కేబినెట్ విస్తరణ&comma; మంత్రివర్గ మార్పులపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నర్సీపట్నంలో అభివృద్ధి పరుగులు.

మల్కాజ్‌గిరిలో ప్రారంభమైన బోనాల సంబరాలు.

ప్రపంచ ఇంధన సరఫరాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలకం.