నిజాయితీని చాటుకున్న డెలివరీ బాయ్..

నిజాయితీని చాటుకున్న డెలివరీ బాయ్

Advertisements

<p>డబ్బుకంటే నిజాయితీ గొప్పదని మరోసారి నిరూపించాడు ఓ డెలివరీ బాయ్&period; రోడ్డుపై దొరికిన రూ&period;2 లక్షలను ఎలాంటి ఆశపడకుండా పోలీసులకు అప్పగించి అందరి ప్రశంసలు అందుకున్నాడు షైక్ వాలీ&period;ఫార్మసీకి సంబంధించిన రూ&period;5 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తుండగా ప్రశాంత్ అనే వ్యక్తి అనుకోకుండా రూ&period;2 లక్షలు పోగొట్టుకున్నాడు&period; ఈ డబ్బులు నాగోల్ ప్రాంతంలో జెప్టో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న షైక్ వాలీకి దొరికాయి&period; కేవలం నాలుగో తరగతి వరకు మాత్రమే చదివిన వాలీ&period;&period; బతుకుదెరువు కోసం డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు&period; అయినప్పటికీ నిజాయితీని ప్రదర్శిస్తూ దొరికిన డబ్బును నేరుగా పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు&period;వాలీ నిజాయితీకి మెచ్చిన నాగోల్ పోలీసులు అతడిని ప్రత్యేకంగా అభినందించి సన్మానం చేశారు&period; అనంతరం బాధితుడు ప్రశాంత్‌కు పోలీసుల సమక్షంలో డబ్బును తిరిగి అందజేశారు&period;నిజాయితీకి గుర్తింపుగా నాగోల్ సీఐ షైక్ వాలీకి రివార్డు కూడా అందించారు&period; ప్రస్తుతం వాలీ నిజాయితీపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..