భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో బీజేపీ ఎంపీ , ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందం పర్యటన..

భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో బీజేపీ ఎంపీ , ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందం పర్యటన

Advertisements

<p>ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు&period; ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతుంటే&comma; ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని చెప్పటం దారుణమని అన్నారు&period; యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో గల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ ఎంపీ &comma; ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందం సందర్శించింది&period; రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న నేతలు&comma; రైతులకు అండగా ఉంటామని హమీ ఇచ్చారు&period; ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన వారిలో బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి&comma;నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్య నారాయణ గుప్తా&comma; ఆర్మూర్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి&comma; కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి&comma; భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యా గౌడ్ ఉన్నారు&period; రాష్ట్ర బీజేపీ నేతల పర్యటన నేపథ్యంలో జిల్లా పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు భారీగా హాజరయ్యారు&period; మూడు వారాలు ఆలస్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; రానున్న రోజుల్లో వర్షాలు పడితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..