బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.

Advertisements

<p>హైదరాబాద్ బాలానగర్‌లో గంజాయి ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన తెలంగాణ ఈగల్ పోలీసులకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది&period; నిందితులు పోలీసులపై కుక్కను వదలడంతో పాటు స్క్రూడ్రైవర్‌తో దాడికి పాల్పడ్డారు&period; అర్ధరాత్రి ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో నిందితుడు పక్క భవనాలపైకి దూకుతూ తప్పించుకునే ప్రయత్నం చేయగా&period;&period; ఎట్టకేలకు పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు&period; అయితే ఈ కేసు దర్యాప్తులో మరింత సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి&period; గంజాయి ముఠాకు కొందరు పోలీసు సిబ్బందితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>హైదరాబాద్ బాలానగర్‌లో ఒక ఇంటిని కేంద్రంగా చేసుకుని గంజాయి విక్రయాలు సాగిస్తున్న ముఠాపై తెలంగాణ ఈగల్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు&period; ఈ ఆపరేషన్ సందర్భంగా నిందితులు పోలీసులపై దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది&period; ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఏపీలోని పాడేరు ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్&comma; కమలాకర్&comma; కిరణ్ అన్నదమ్ములు కొన్నేళ్ల క్రితం కుటుంబాలతో హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు&period; బయటకు క్యాటరింగ్ బాయ్స్‌ను సరఫరా చేసే వ్యాపారం చేస్తున్నట్లు చెబుతూ&comma; 2022 నుంచి గంజాయి విక్రయాలు ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు&period;<&sol;p>&NewLine;<p>ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసేవారని దర్యాప్తులో తేలింది&period; వాట్సాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి&comma; పాత ఎయిర్‌పోర్టు రోడ్డులో ముందుగా నిర్ణయించిన ప్రాంతాల్లో పొట్లాలను ఉంచి&comma; వినియోగదారులకు ఫొటోలు&comma; లొకేషన్ పంపే పద్ధతిలో విక్రయాలు సాగించినట్లు పోలీసులు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సమాచారం అందుకున్న తెలంగాణ ఈగల్ పోలీసులు డీఎస్పీలు నర్సింగరావు&comma; రమేశ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలతో నిందితుల కదలికలపై నిఘా పెట్టారు&period;నిందితులు ఇంటికి చేరుకున్నట్లు గుర్తించిన పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి ఆపరేషన్ ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;<p>పోలీసులు ఆవరణలోకి ప్రవేశించగానే నిందితులు కుక్కను ఉసిగొల్పినట్లు సమాచారం&period; దీంతో ఓ కానిస్టేబుల్‌కు గాయమైంది&period; పోలీసులు అప్రమత్తమై ఇద్దరు నిందితులు దుర్గాప్రసాద్&comma; కమలాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>అయితే కిరణ్ మాత్రం తప్పించుకునే ప్రయత్నంలో ఇన్‌స్పెక్టర్ మల్లేశ్‌పై స్క్రూడ్రైవర్‌తో దాడి చేసి&comma; పక్క భవనాలపైకి ఎక్కి పరారయ్యేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు&period; ఈ క్రమంలో ఓ వృద్ధురాలి సెల్‌ఫోన్ తీసుకుని&comma; ఓ అపార్టుమెంట్‌పైకి ఎక్కి పోలీసులతో వాదించినట్లు వెల్లడించారు&period;ఎట్టకేలకు అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు&period; కిరణ్ భార్య హారికను సైతం పోలీసులు అరెస్టు చేశారు&period;<&sol;p>&NewLine;<p>నిందితుల ఇంట్లో సోదాలు నిర్వహించగా 14&period;5 కిలోల గంజాయి&comma; ఒక ఎయిర్‌గన్ లభించినట్లు ఈగల్ అధికారులు వెల్లడించారు&period; నిందితుల సెల్‌ఫోన్లను పరిశీలించగా 203 మంది వారి వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు గుర్తించారు&period; వీరిలో వంద మందిని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా 72 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ఈ కేసు విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చాయి&period; బాలానగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఒక ఎస్సై&comma; ఐదుగురు కానిస్టేబుళ్లతో నిందితులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం&period; ఈగల్ పోలీసులు దాడి చేయడానికి కొద్దిసేపటి ముందు ఓ కానిస్టేబుల్ నిందితుల ఇంటికి వచ్చి వెళ్లినట్లు కూడా దర్యాప్తులో తేలినట్లు అధికారులు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>అలాగే నిందితుల ఇంట్లో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో కొందరు పోలీసు సిబ్బంది పాల్గొన్నట్లు సమాచారం&period; అక్కడ పోలీసు వైర్‌లెస్ పరికరానికి సంబంధించిన మ్యాన్‌ప్యాక్ భాగం లభించడం ఈ వ్యవహారంలో మరిన్ని అనుమానాలకు తావిచ్చింది&period; నిందితులతో కొందరు పోలీసు సిబ్బంది కుమ్మక్కై&comma; తనిఖీలు లేదా దాడులకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే చేరవేసేవారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది&period; ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై శాఖాపరమైన&comma; చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అత్యల్ప ఉత్పాదకతతో ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాలు.

మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.

అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.