తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుదేలైంది -రాంచందర్‌ రావు..

తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుదేలైంది -రాంచందర్‌ రావు

Advertisements

<p>ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు&period; గత కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేయగా&comma; ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తూ పేదలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు&period; ఎంఐఎం ఒత్తిడికి లొంగి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేశారని దుయ్యబట్టారు&period; నగరంలో డివిజన్ల ఏర్పాటుపై అధికారులకే క్లారిటీ లేదన్నారు&period; కాంగ్రెస్ ప్రభుత్వానికి మజ్లిస్ పార్టీయే ముఖ్యమని&comma; నగర ప్రజలు కాదని విమర్శించారు&period; భాగ్యనగరంలో తాగునీటి ఎద్దడి&comma; కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని&comma; చిన్న వాన పడితేనే నగరం మునిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు&period; గత బీఆర్ఎస్ పాలనలో నేతలు రియల్ ఎస్టేట్ పేరుతో జేబులు నింపుకోగా&comma; ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆ రంగం పూర్తిగా కుదేలైందని రామచందర్‌ రావు ఆరోపించారు&period; హైదరాబాద్‌ను నిజమైన విశ్వనగరంగా మార్చడం&comma; అవినీతి రహిత పాలన అందించడం ఒక్క బీజేపీకే సాధ్యమని స్పష్టం చేశారు&period; రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్&comma; బీఆర్ఎస్&comma; మజ్లిస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పి&comma; బీజేపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.