మూసీ సుందరీకరణ పనులపై సీఎం ఫోకస్‌.

Advertisements

<p>హైదరాబాద్‌లో మరో సుందరీకరణ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది&period; మీరాలం చెరువు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు&period; మీరాలం చెరువు వద్దకు చేరుకున్న సీఎం&period;&period; జరుగుతున్న పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు&period; మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మీరాలం చెరువుపై సస్పెన్షన్‌ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది&period; భారీ క్రేన్‌ పైకి వెళ్లి&period;&period; చెరువులో జరుగుతున్న పనులను సీఎం పరిశీలించారు&period; అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు&period; పనుల్లో ఎక్కడా జాప్యం ఉండకూడదని&period;&period; నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్నో అంశాలపై దృష్టి కేంద్రీకరించారు&period; చెరువు అభివృద్ధితో పాటు పరిసర ప్రాంతాల్లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు&period; మీరాలం చెరువులోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు&period; చెరువు నిండిన సమయంలో వరద నీరు సాఫీగా మూసీలోకి వెళ్లేలా నాలాను విస్తరించాలని ఆదేశించారు&period; మీరాలం చెరువును కేవలం నీటి వనరుగా కాకుండా&period;&period; ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు&period; వాటర్‌ స్పోర్ట్స్‌కు అనువైన డిజైన్‌ రూపొందించాలని అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించారు&period; చెరువులో ఉన్న ఐలాండ్‌ను కూడా అభివృద్ధి చేసి&period;&period; సందర్శకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు&period; అంటే&period;&period; ఒకవైపు చెరువు పరిరక్షణ&period;&period; మరోవైపు వరద నీటి నిర్వహణ&period;&period; ఇంకోవైపు పర్యాటక అభివృద్ధి&period;&period; ఇవన్నీ కలిపి మీరాలం చెరువును సరికొత్త రూపంలో తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఆలోచన&period; మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న పనులకు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పరిశీలన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది&period; మీరాలం చెరువు అభివృద్ధి పనులు పూర్తయితే&period;&period; హైదరాబాద్‌కు మరో ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.