ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.

Advertisements

<p>తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినూత్న నిరసన చేపట్టారు&period; కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో కూడా అమలు చేయాలంటూ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు&period; ట్రాక్టర్‌పై అసెంబ్లీకి చేరుకున్న పాయల్ శంకర్&period;&period; రాష్ట్రంలో రైతులకు పంట బీమా అందించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు&period; కేంద్ర ఫసల్ బీమా పథకంలో ఖరీఫ్ పంటలకు రైతులు రెండు శాతం&comma; రబీ పంటలకు 1&period;5 శాతం&comma; ఉద్యానవన పంటలకు ఐదు శాతం ప్రీమియం చెల్లించే విధానం ఉందని తెలిపారు&period; ప్రకృతి వైపరీత్యాలు&comma; పంట నష్టాల సమయంలో రైతులకు ఈ పథకం భరోసాగా నిలుస్తుందని అన్నారు&period; అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం లేదని పాయల్ శంకర్ ఆరోపించారు&period; ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం చేకూరుతుందనే కారణంతోనే రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు&period; రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఫసల్ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.