పెద్దపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..

పెద్దపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

Advertisements

<p>పెద్దపల్లి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర మంత్రుల బృందం పరిశీలించింది&period; జిల్లాలో పండిన వరి పంట&comma; కొనుగోలు పరిస్థితులపై అధికారులు&comma; రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకుంది&period; కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రులు&comma; అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;<p>జిల్లా అధికారులు&comma; రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించిన మంత్రులు వరి కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు&period; రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని&comma; తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు&period; జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అధికంగా వరి దిగుబడి వచ్చిందన్నారు&period;<&sol;p>&NewLine;<p>అలాగే రైతులను బీఆర్ఎస్&comma; బీజేపీ పార్టీలు అయోమయానికి గురిచేస్తున్నాయని ఆరోపించిన మంత్రులు&period;&period; రైతుల పట్ల అన్యాయం జరిగితే మిల్లర్లు&comma; ట్రేడర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు&period; ఈ సీజన్‌లోనే 11 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు&period; అధిక ఉష్ణోగ్రతల మధ్య పనిచేస్తున్న హమాలి కార్మికులకు కూడా మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..