ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??

ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో

Advertisements

<p>ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి నది అంత్య పుష్కరాల‌కు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు&period; ఈ క్రమంలోనే పుష్కరాలకు హాజరు కావాల్సిందిగా దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థాన అర్చకులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు&period; ఈ సందర్భంగా సరస్వతి అంత్య పుష్కరాల విశిష్టతను సీఎంకు వివరించి&comma; ప్రారంభోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు&period; అయితే&comma; 12 రోజుల పాటు ఈ అంత్య పుష్కరాల వేడుకలు శాస్త్రోక్తంగా జరగనున్నాయి&period; త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కర స్నానాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది&period; భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల వద్ద తాగునీరు&comma; రవాణా&comma; పారిశుధ్యం&comma; భద్రతా పరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని మంత్రి కొండా సురేఖ ఇప్పటికే అధికారులను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..