హనుమకొండ జిల్లాలో లగ్జరీ కార్లలో వడ్ల బస్తాలు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్.

హనుమకొండ జిల్లాలో లగ్జరీ కార్లలో వడ్ల బస్తాలు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్

Advertisements

<p>హనుమకొండ జిల్లాలో లగ్జరీ కార్లలో తిరుగుతూ వడ్ల బస్తాలను దొంగిలిస్తున్న ఒక విచిత్రమైన దొంగల ముఠా గుట్టును రట్టు చేశారు శాయంపేట పోలీసులు &period; బీటెక్ విద్యార్థులు&comma; మైనర్ బాలురు కలిసి జల్సాల కోసం దొంగతనాలకు అలవాటు పడటం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది&period; హనుమకొండ జిల్లాలోని శాయంపేట&comma; దామెర&comma; ఐనవోలు&comma; కమలాపూర్&comma; హసన్ పర్తి మండలాల్లోని వడ్ల కళ్ళాల్లో గత కొంతకాలంగా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి&period; రాత్రి వేళల్లో టాటా హారియర్&comma; బ్రెజ్జా వంటి లగ్జరీ కార్లలో వస్తున్న ఈ ముఠా&period;&period; కళ్ళాల్లోని వడ్ల బస్తాలను ఎత్తుకెళ్తోంది&period; ఈ వరుస చోరీలపై నిఘా పెట్టిన శాయంపేట పోలీసులు కొప్పుల బ్రిడ్జ్ సమీపంలో ఈ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు&period;నిందితులు మొత్తం 7 కేసుల్లో 135 క్వింటాళ్ల బరువుగల 242 వడ్ల బస్తాలను దొంగిలించినట్లు ఒప్పుకున్నారు&period; అలా దొంగిలించిన వడ్లను గొర్రెకుంటలోని గణేష్ రైస్ మిల్లులో విక్రయించినట్లు విచారణలో తేలింది&period; నిందితుల నుంచి పోలీసులు రూ&period; 3&comma;05&comma;200 నగదుతో పాటు&comma; దొంగతనాలకు ఉపయోగించిన టాటా హారియర్&comma; బ్రెజ్జా కార్లను సీజ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అండమాన్‌ సముద్రంలో సహజ వాయువు నిక్షేపాలు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అగ్ని ప్రమాదం.

హిమాచల్ ప్రదేశ్‌లో భూప్రకంపనలు.