నాగర్‌కర్నూల్ జిల్లాలో పిడుగుపాటుకు ఏఆర్ కానిస్టేబుల్ దుర్మరణం.

నాగర్‌కర్నూల్ జిల్లాలో పిడుగుపాటుకు ఏఆర్ కానిస్టేబుల్ దుర్మరణం

Advertisements

<p>తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది&period; ముఖ్యమంత్రి బందోబస్తు విధులు ముగించుకుని వస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను పిడుగు రూపంలో మృత్యువు కబళించింది&period; నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన తోటి పోలీస్ సిబ్బందిని&comma; స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది&period; నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఉల్పారా గ్రామానికి చెందిన మద్దమల్ల రాజు కానిస్టేబుల్‌గా నాగర్‌కర్నూల్ ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు&period; గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి బందోబస్తు విధులలో భాగంగా ఆయన సోమశిలలో సేవలు అందించారు&period; సీఎం బందోబస్తు విధులను ముగించుకుని ఆయన తిరుగు ప్రయాణమయ్యారు&period; ఈ క్రమంలో మామిళ్లపల్లి గ్రామం సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఆకస్మికంగా పిడుగు పడింది&period; ఈ ఘోర ప్రమాదంలో కానిస్టేబుల్ రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు&period;<br &sol;>&NewLine;సమాచారం అందుకున్న ఉప్పునుంతల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు&period; రాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.