తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు..

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు

Advertisements

<p>తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో రాష్ట్ర విద్యాశాఖ&comma; ఇంటర్ బోర్డు కలిసి విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాయి&period; 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ విద్యలో కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి&period; నూతన విద్యావిధానంలో భాగంగా&period;&period; ప్రాక్టికల్స్&comma; మ్యాథ్స్ మార్కుల్లో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి&period; విద్యార్థుల్లో సైన్స్&comma; మ్యాథ్స్ సబ్జెక్టుల్లో భయాన్ని పోగొట్టి వాటిపై ఆసక్తి పెంచేందుకు బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది&period; ఇప్పటి వరకూ ఇంటర్లో సెకండియర్లోనే ప్రాక్టికల్స్ ఉండేవి&period; కానీ కొత్త మార్పుల ప్రకారం&period;&period; ఇంటర్ ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు&period; ఫిజిక్స్&comma; కెమిస్ట్రీ&comma;బోటనీ&comma; జువాలజీ సబ్జెక్టుల్లో ఏడాదికి 15 మార్కుల చొప్పు ప్రాక్టికల్స్ చేయించనున్నారు&period; దీనివల్ల ఫస్టియర్ నుంచే వాటిపై పట్టు సాధించే ఛాన్సుంటుంది&period; అలాగే మ్యాథ్స్ లో యాక్టివిటీ బెస్డ్ లెగ్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు&period; దీనివల్ల ప్రతి ఏటా 15 మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా కేటాయిస్తారు&period; ఫైనల్ పరీక్షల్లో మ్యాథ్స్ 75 మార్కులకు బదులుగా 60 మార్కులకు మాత్రమే నిర్వహించేలా ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేసింది&period; వార్షిక పరీక్షను కూడా 100కు బదులుగా 80 మార్కులకే పరిమితం చేయాలని బోర్డు నిర్ణయించింది&period; మిగతా 20 మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారానే కేటాయిస్తారు&period; ఇక లాంగ్వేజీల్లో కూడా ఇదే విధానం అమల్లోకి రానుంది&period; బట్టీపట్టే విధానాన్ని తగ్గించి&period;&period; వారి జ్ఞాపకశక్తిని పెంచేలా&comma; ప్రయోగాత్మక నైపుణ్యాలను పెంచడమే ఈ నూతన విద్యావిధానం లక్ష్యమని బోర్డు స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..