పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ప్రధాని మోదీ..

పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ప్రధాని మోదీ

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు&period; హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని&comma; జూబ్లీహిల్స్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి ప్రత్యేకంగా వెళ్లారు&period; ఇటీవల సైనస్ సమస్య కారణంగా పవన్ శస్త్రచికిత్స చేయించుకుని&comma; ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు&period; ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ను కలుసుకున్న ప్రధాని మోదీ&comma; ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు&period; త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని&comma; తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షించారు&period; తన కోసం స్వయంగా ఇంటికి వచ్చి పరామర్శించడం పట్ల పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు&period; ప్రధాని మోదీకి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు&period; పవన్‌ను పరామర్శించిన అనంతరం&comma; ప్రధాని మోదీ జూబ్లీహిల్స్ లోనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“అగ్లీ స్టోరీ” చిత్రంతో నందుకు మంచి బ్రేక్ వస్తుంది..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..

కేరళంలోని వయనాడ్‌లో పోస్టర్ల కలకలం.