తెలంగాణలో మోదీ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు..

తెలంగాణలో మోదీ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు

Advertisements

<p>భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు&period; ఈ సూచనలపై దేశవ్యాప్తంగా ప్రజలు వివిధ కోణాల్లో చర్చించుకుంటున్నారు&period; ఈ సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోడీ సూచనలు వైఫల్యానికి నిదర్శనమని తీవ్ర విమర్శలు చేశారు&period; పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో&&num;8230&semi; దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి పౌరులు కొన్ని త్యాగాలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వేదికగా పిలుపునిచ్చారు&period; ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు&period; ప్రధాని చేసిన ఈ సూచనలు ఆయన ప్రభుత్వ పన్నెండేళ్ల వైఫల్యానికి నిదర్శనమని రాహుల్ విమర్శించారు&period;కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్‌à°² అమలుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు వేచి చూసిన మోడీ ప్రభుత్వం&comma; గత వారం గెజిట్ నోటిఫికేషన్ల ద్వారా ఈ కార్మిక వ్యతిరేక చట్టాలను దొంగచాటుగా అమల్లోకి తెచ్చిందని ఆయన విమర్శించారు&period; ఈ కొత్త కోడ్‌లు దేశంలోని కోట్లాది మంది కార్మికుల హక్కులను కాలరాస్తాయని&comma; &&num;8216&semi;హైర్ అండ్ ఫైర్&&num;8217&semi; విధానాన్ని ప్రోత్సహిస్తాయని ఆయన ఆరోపించారు&period;ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున &&num;8216&semi;శ్రామిక్ న్యాయ్&&num;8217&semi; పేరుతో ఐదు పాయింట్ల ఎజెండాను ఖర్గే ప్రకటించారు&period; ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు నియామకాలను నిలిపివేస్తామని&comma; మోదీ ప్రభుత్వం నీరుగార్చిన కార్మిక చట్టాలను తిరిగి సమీక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..