దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్క రోజులోనే 752 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 21 నుంచి చూస్తే ఇవే అత్యధికం కావడం గమనార్హం. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా నలుగురు మరణించడంతో మరణాల సంఖ్య పెరిగింది. 24 గంటల్లో నమోదైన నాలుగు మరణాల్లో కేరళలో రెండు, రాజస్థాన్, కర్ణాటకలో ఒకటి చొప్పున నమోదయ్యాయి. కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని మళ్లీ కలవరపరుస్తోంది. కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8.50 లక్షలకు పైగా కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్వో పేర్కొంది. వైరస్ తో గడిచిన 24 గంటల్లో నలుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు బయటపడ్డ కేరళలోనే వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోందని తెలిపారు. నిన్న బయటపడ్డ కొత్త కేసులు మొత్తం 752 కాగా అందులో 565 మంది కరోనా బాధితులు కేరళలోనే ఉన్నారని వివరించారు. యాక్టివ్ కేసులు కూడా కేరళలోనే అత్యధికమని, వైరస్ బాధితులలో 2,872 మంది కేరళలోనే ఉన్నారని చెప్పారు. గోవాలోనూ జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయని చెప్పారు.
Read Also..
Read Also..