తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో మ్యాజిక్ మార్క్ 60 సీట్లు కాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 61 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఫలితాల ట్రెండ్ తో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పోలీసులు భద్రత పెంచారు. ఆయన నివాసానికి కాంగ్రెస్ కార్యకర్తలు పోటెత్తుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు సెక్యూరిటీ పెంచారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పైనా రేవంత్ రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు చోట్లా రేవంత్ రెడ్డి లీడ్ లో కొనసాగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద శనివారం నుంచే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ అభ్యర్థుల హవా కొనసాగడంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అనుచరులు బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు భద్రత మరింత పెంచారు.
Read Also..
Read Also..