కాంగ్రెస్ బీజేపీ లపై తీవ్ర విమర్శలు చేసిన విద్యాశాఖ మంత్రి

minister sabitha indra reddy

Advertisements

&NewLine;<p>బీజేపీ&comma; కాంగ్రెస్‌ పార్టీలు రైతుల పాలిట శత్రువులని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు&period; రైతులకు రైతుబంధు నిధులను ఇవ్వకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా&comma; ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో రైతులకు న్యాయం జరిగిందని మంత్రి పేర్కొన్నారు&period; శనివారం నాడు రావిర్యాల&comma; మోహబ్బత్ నగర్&comma; కే&period; సి&period; తండా&comma; మహేశ్వరం&comma; తుక్కు గూడ జరిగిన రోడ్ షో లలో మంత్రి ప్రసంగించారు&period; తెలంగాణలో కర్ణాటక మోడల్ అమలు చేస్తామని పేర్కొంటూ రైతులకు మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అనడం శోచనీయమని మంత్రి పేర్కొన్నారు&period; ప్రస్తుత ప్రభుత్వం 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నా&comma; కేవలం మూడు గంటలు రైతులకు చాలని అవమానపరచడం కాంగ్రెస్ పార్టీకి తగదని మంత్రి పేర్కొన్నారు&period; అవసరమైతే రైతులు 10 ఎచ్ పి మోటార్లు బిగించుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఉచిత సలహాలు ఇస్తున్నారని విమర్శించారు&period; మరో వైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు మోటార్లకు మీటర్లు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి చేసిందని&comma; మీటర్లు పెట్టకపోతే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు కోత పెడుతామని బెదిరించిందని&comma; అయినా మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్‌ తెగేసి చెప్పారని మంత్రి వివరించారు&period; దేశంలో మోటార్లకు మీటర్లు పెట్టని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు&period; తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన 25 వేల కోట్ల రూపాయల నిధులను నిలిపివేశామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొనడాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు&period; రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ&period;25 వేల కోట్ల నష్టం చేసిన బీజేపీకి ఓట్లడిగే అర్హతే లేదని అన్నారు&period; మోటార్లకు మీటర్లు పెట్టమని బీజేపీ సర్కారు ఒత్తిడి చేసిందని మేము చెబుతుంటే లేదు లేదు తమ ప్రభుత్వం ఆ మాటే అనలేదని తెలంగాణ బీజేపీ నేతలు అదరగొట్టిండ్రని చెప్పారు&period; సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని చెప్పారు&period; కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా మోటార్లకు మీటర్లు పెట్టారని&comma; ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా రాష్ట్రంలో రైతుల మోటార్లకు మీటర్లు పెడుతారని అన్నారు&period; పొరపాటున కూడా బీజేపీ&comma; కాంగ్రెస్‌ పార్టీలకు ఓటు వేయవద్దని కోరారు&period; అభివృద్ధి సంక్షేమ రంగాల్లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రి స్థానంలో నిలపాలని ప్రజల్ని కోరారు&period; గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం&comma; ప్రస్తుత ఎన్నికల్లో ఇస్తున్న హామీలను కూడా తప్పని సరిగా నెరవేరుస్తుందని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..