రేపు ఎన్నికలకు రంగం సిద్ధం..

Elections

Advertisements

&NewLine;<p>రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి&period; భాగంగా మునుగోడు నియోజకవర్గం లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు&period; ఎన్నికల సామాగ్రి అంత ఈరోజు ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళుతుంది&period; ప్రస్తుతం ఆ ఏర్పాట్లలోనే అధికారులు నిమగ్నమై ఉన్నారు&period; మునుగోడు నియోజకవర్గం లో మొత్తం 39 అభ్యర్థులు బరిలో ఉన్నారు&period; మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 2&comma;52&comma;648 ఓటర్లు కలరు&period; పురుషులు 1&comma;26&comma;223<br>మహిళలు 1&comma;26&comma;421 ట్రాన్స్ జెండర్స్04 ఉన్నారు&period; మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా 207 పోలింగ్ ప్రదేశాలు కలవు&comma; 307 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు&period; పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు&period; సమస్య ఆత్మక పోలి కేంద్రాలుగా 112 గుర్తించారు&period; దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు&period; మహిళా పోలింగ్ కేంద్రాలు 5&comma; మోడల్ పోలింగ్ కేంద్రాలు 5&comma;యూత్ కేంద్రం 1&period; మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా 30 రూట్స్ ఏర్పాటు చేశారు ప్రతి రూటుకి నలుగురు చొప్పున మొత్తం 1&comma;228 మంది పోలింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు&period; 201 వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు&period; మైక్రో అబ్జర్వర్ 71మెంబర్స్&comma;ఎక్స్ సర్వీస్ మెంబర్స్ 51 మెంబర్స్ నియమించారు&period; నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఐదు అంచల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు&period; మొత్తం 2500 మంది పైగా పోలీస్ సిబ్బంది పనిచేస్తున్నారు&period; ఈవీఎంలు తీసుకెళ్లి రూట్ బస్సులకు జియో ట్యాబ్లెట్ ఏర్పాటు చేశారు&period; మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 1300 మంది పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నారు&period; 550మంది ఎన్నికల నిర్వహిస్తున్న అధికారులు ఉపయోగించుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..