రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత

Cold intensity

Advertisements

&NewLine;<p>రాగల రెండు మూడు రోజుల పాటు తెలంగాణలో చలితీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది&period; రాష్ట్రంలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని వెల్లడించింది&period; అయితే మూడు రోజుల తర్వాత చలి తీవ్రత సాధారణ స్థితికి రావొచ్చునని పేర్కొంది&period; ఇక డిసెంబర్ చివరి వారం నుంచి చలి తీవ్రత మళ్లీ పెరుగుతుందని&comma; చల్లని గాలులు వీస్తాయని హెచ్చరించింది&period; రాత్రి సమయంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ వరకు తక్కువగా నమోదవుతున్నట్లు తెలిపింది&period; హైదరాబాద్&comma; చుట్టు పక్కల ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది&period; మెదక్ జిల్లాలో అత్యల్పంగా 12&period;5 డిగ్రీల ఉష్ణోగ్రత&comma; అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీలు నమోదవుతున్నట్లు పేర్కొంది&period; పగటి పూట సగటున 28 నుంచి 31 డిగ్రీల మధ్య ఉంటున్నట్లు పేర్కొంది&period; అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 31 డిగ్రీలు&comma; అత్యల్పంగా హైదరాబాద్&comma; శివారు ప్రాంతాల్లో 28 డిగ్రీలు నమోదవుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..