బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తాజా తీర్పు..

Bilkis Bano

Advertisements

&NewLine;<p>దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో సుప్రీం కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది&period; 11 మంది దోషుల ముందస్తు విడుదల చెల్లదంటూ గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసింది&period; దోషులను ముందస్తుగా విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది&period; ఈమేరకు జస్టిస్ బీవీ&period; నాగరత్న&comma; ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది&period; ఈ కేసులో బాధితురాలు బిల్కిస్ బానోకు ఊరట కలిగించేలా తీర్పు చెప్పింది&period; 2002 లో జరిగిన గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది&period; బానో ఇంట్లోకి చొరబడిన పలువురు దుండగులు ఆమెపై అత్యాచారం చేసి&comma; మూడేళ్ల కూతురితో పాటు ఇంట్లో అందరినీ చంపేశారు&period; ఈ దారుణంపై బిల్కిస్ బానో సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేశారు&period; నిందితుల అరెస్టు నుంచి వారికి శిక్ష పడేంత వరకూ పోరాడారు&period; నేరం రుజువు కావడంతో నిందితులకు కోర్టు మరణ శిక్ష విధించింది&period; దీనిపై నిందితులు అప్పీల్ చేసుకోవడంతో యావజ్జీవ శిక్షకు మార్చింది&period; అయితే&comma; ఈ కేసులో మొత్తం పదకొండు మంది దోషులను గతేడాది గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేసింది&period; 1992 చట్టం ప్రకారం 14 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకోవడంతో పాటు జైలులో సత్ర్పవర్తనతో మెలిగారని పేర్కొంటూ స్వాతంత్ర దినోత్సవం రోజు బయటకు పంపింది&period; దీనిపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది&period; బాధితురాలు మరోమారు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు&period; టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సహా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ&comma; జర్నలిస్ట్ రేవతి లాల్&comma; లక్నో యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రూప్ రేఖా వర్మ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు గతేడాది అక్టోబర్ లో తీర్పును రిజర్వ్ చేశారు&period; తాజాగా తీర్పు వెలువరించిన కోర్టు దోషుల ముందస్తు విడుదల చెల్లదని తేల్చి చెప్పింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్