పదవులకు రాజీనామా చేయనున్న ముఖ్య నేతలు..

putta madhu

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి జిల్లాలో ముఖ్య నేతలు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు&period; బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఈ దంపతులు ఇద్దరు కూడా రాజీనామా చేయనున్నామని వెల్లడించడం సంచలనంగా మారింది&period; జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్&comma; ఆయన సతీమణి&comma; మంథని మునిసిపల్ ఛైర్ పర్సన్ పుట్ట శైలజలు ప్రజాప్రతినిధులుగా రాజీనామా చేయనున్నట్టు ఆయన కార్యాలయ వర్గాల పేరిట ఓ ప్రకటన వెలువడింది&period; బుధవారం మద్యాహ్నం రాజీనామా పత్రాలను జిల్లా కలెక్టర్ కు అప్పగించనున్నామని కూడా అందులో వివరించారు&period; తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన పుట్ట మధూకర్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు చేతిలో ఓటమి పాలయ్యారు&period; ఫలితాలు వెలువడినప్పటి నుండి కూడా సైలెంట్ గానే ఉన్న పుట్ట మధు అనూహ్యంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది&period; రాజకీయంగా శ్రీధర్ బాబుకు&comma; పుట్ట మధుకు దశాబ్దన్నర కాలంగా వైరుధ్యాలు ఉన్నాయి&period; దీంతో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగానే పొలిటికల్ ఫైట్ జరిగిందనే చెప్పాలి&period; అయితే తాజాగా పుట్ట మధు తీసుకున్న నిర్ణయంతో బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది&period; సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అంశంపై పెద్ద ఎత్తున డిస్కషన్ సాగుతోంది&period; అయితే బుధవారం రాజీనామా చేసిన తరువాత రాజీనామాకు గల కారణాలను వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్