పరమ పవిత్రం కాశీ అన్నపూర్ణ దేవాలయం

Kashi Annapurna Temple

Advertisements

&NewLine;<p>విజయవాడ నగరంలోని శివక్షేత్రాల్లో అతి ప్రాచీనమైన దేవాలయంగా కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం ప్రసిద్ధి&period; 105 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎందరో భక్తులు కాశీ విశ్వేశ్వరుని అన్నపూర్ణను దర్శించుకొని సేవించారు&period; అప్పన్న వెంకట కృష్ణయ్య&comma; అద్దెపల్లి వెంకటప్పయ్య అనే ఇద్దరు శివ భక్తులు శివ నామస్మరణతో ఆధ్యాత్మిక జీవనం చేస్తుండేవారు&period; ఈశ్వరుని సేవించికునేందుకు పరమ పవిత్ర క్షేత్రం అయిన కాశీకి వెళ్లారు&period; అక్కడ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకునేందుకు గంగానది తీరంలో స్నానం ఆచరిస్తుండగా వీరు మునిగి పైకి తేలిన వెంటనే వారి చేతిలో శివలింగాలు దోసిళ్లలోకి వచ్చాయి&period; వీరు వీటిని పవిత్రంగా ఈశ్వరుని ఆదేశంగా భావించి నగరానికి వచ్చి చల్లపల్లి బంగ్లా వద్ద గల ప్రదేశంలో 1909 మార్చి 3వ తేదీన శుద్ద ఏకాదశి బుధవారం నాడు వీటిని ప్రతిష్టించారు&period; అప్పటినుండి ఆధ్యాత్మికతో కూడిన భక్తి కార్యక్రమాలతో ఆ ప్రాంతం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిలోకి వచ్చింది&period; కొంత కాలానికి అక్కడ దేవాలయాన్ని నిర్మించి వారి వంశీకులు స్వామివారిని ఆరాధిస్తూ&comma; అభిషేకిస్తూ గడిపారు&period; భక్తులు కూడా స్వామి వారిని కొలుస్తూ తమ మనోభిష్టాన్ని నెరవేర్చాలని కోరుతూ స్వామి అనుగ్రహం పొందేందుకు పూజాదికాలు విశేషంగా జరుపుతారు&period; మహాకుంభాభిషేకం&comma; సహస్ర శంకాభిషేకం&comma; రుద్ర యాగం &comma; చండీ పారాయణం&comma; మహా యజ్ఞాది క్రతువులు నిర్వహించారు&period; స్వామి వారికి ప్రీతి కరమైన ప్రతి సోమవారం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేస్తున్నారు&period; ప్రతి నిత్యం భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ చేస్తున్నారు&period; 100 సంవత్సరాలనుండే దేవాలయాన్ని సుందరంగా అలంకరించి భక్తులకు కావాల్సిన సదుపాయాల కల్పనకు శ్రద్ధ తీసుకున్నారు&period; దేవస్థాన ధర్మ కర్తలు అయిన అప్పన సూర్యనారాయణ&comma;మోహనరావు&comma;వెంకట సత్యనారాయణలు ఈ విశేష పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు&period; దేవాలయం చుట్టూ ఉన్న గోడలపై స్వామి వారి ప్రతిమలను వివిధ రూపాలలో పెయింటింగ్ లు చేయించారు&period; దేవస్థానం ఆవరణలో ఫ్లోరింగ్ జనరేటర్ నిత్య ప్రసాదాలు&comma; విశేష పూజా కార్యక్రమాలు&comma; ధర్మ కర్తల సహాయంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు&period; దేవస్థానం ఆవరణలో ఉన్న కోటి లింగాల చెట్టు పుష్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి&period; ఈ పువ్వులు పరమ శివునికే అర్పితం&period; ఫిబ్రవరి లో లక్ష రుద్రాక్షల పూజ&comma; రుద్ర యాగం&comma; సర్వ దేవతల హోమాలు జరుగుతాయి&period; ప్రతి షష్టికి సుబ్రహ్మణ్యేశ్వరునికి విశేష పూజలు జరుగుతాయి&period; ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు అభిషేకాలుహోమాలు జరుగుతాయి&period; విశేష పవిత్ర దినాల్లో కార్తీక మాసం&comma; శివరాత్రిలో శరన్నవారాత్రులలో అమ్మవారికి త్రికాల పూజలు &comma;మహా మంత్రం అనుష్టానం&comma; అభిషేకాలు&comma; నిత్య అభిషేక వితరణలు జరుగుతాయి&period; ప్రతి నిత్యం లక్ష్మీ గణపతి హోమం&comma; రుద్ర హోమం ఇక్కడ జరుగుతాయి&period; భక్తులంతా దర్శించుకొని ఆ కాశీ అన్నపూర్ణ ఆశీర్వాదం అనుగ్రహం పొందగలరు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..

భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..