మరో ఐఎఎస్ తిమింగలం పేరు వెలుగు..!

Director Siva Balakrishna

Advertisements

&NewLine;<p>హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ à°¶à°¿à°µ బాలకృష్ణ అక్రమాస్తుల చిట్టాలో మరో ఐఎఎస్ తిమింగలం పేరు వెలుగు చూసింది&period; వీరిరువురు చేతులు కలిపి చేసిన దందాలు అన్ని ఇన్నీ కావు&period; ఇలా కోటాను కోట్ల రూపాయలు దిగమింగేశారు&period; అయితే శివబాలకృష్ణను ఏసీబీ అరెస్టు చేసిన తరువాత విచారణలో పలు నిర్ఘాంతపోయే అంశాలు వెలుగు చూశాయి&period; ఏకంగా తానే కాకుండా ఇంకో ఉన్నతాధికారి అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం ఒక్కసారిగా గుప్పుమంది&period; కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు ఇద్దరి అధికారాలను అడ్డుపెట్టి చక్రం తిప్పేశారు&period; అక్రమాస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ à°¶à°¿à°µ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు వెలుగు చూశాయి&period; కన్ఫెషన్ రిపోర్ట్‌లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరును à°¶à°¿à°µ బాలకృష్ణ ప్రస్తావించారు&period; నేర అంగీకార నివేదికలో బయటపడ్డ వివరాల ప్రకారంశివ బాలకృష్ణ ద్వారా తమకు కావాల్సిన బిల్డింగ్‌లకు అరవింద్ కుమార్ అనుమతులు జారీ చేయించుకున్నారు&period; నార్సింగిలోని ఒక కంపెనీకి చెందిన వివాదాస్పద భూమికి సంబంధించి à°¶à°¿à°µ బాలకృష్ణ క్లియరెన్స్ ఇచ్చారు&period; అరవింద్ కుమార్ ఆదేశాలతోనే 12 ఎకరాల భూమికి ఆయన క్లియరెన్స్ ఇచ్చారు&period; నార్సింగ్‌లోని ఎస్‌ఎస్‌వీ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వడానికి ఐఏఎస్ అరవింద్ కుమార్ రూ&period;10 కోట్లు డిమాండ్ చేశారు&period; అరవింద్ కుమార్ డిమాండ్ చేసిన రూ&period;10 కోట్లలో షేక్ సైదా కోటి రూపాయలు చెల్లించారు&period; గత డిసెంబర్‌లో బాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్‌కు ఆ కోటి రూపాయలు చేరాయి&period; జూబ్లీహిల్స్‌లోని అరవింద్ కుమార్ నివాసానికి వెళ్లి మరి బాలకృష్ణ కోటి రూపాయలు ఇచ్చారు&period; అలాగే మహేశ్వరంలోని మరో బిల్డింగ్ అనుమతి కోసం కూడా అరవింద్ కుమార్ కోటి రూపాయలు డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;main-news&sol;inter-student-suicide&sol;amp&sol;">తాజావార్తలకోసం <&sol;a>ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్