మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎన్డీయే కూటమి సంపూర్ణ మద్దతు..

Advertisements

<p>మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి&period; ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో ఈ మేరకు కీలక తీర్మానం చేశారు&period; ఈ బిల్లు విషయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని&comma; వైసీపీని సైతం ఆహ్వానించాలని నిర్ణయించారు&period; ఈ భేటీలో సీఎం చంద్రబాబు&comma; ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్&comma; బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్&comma; టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;<p>దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; లోక్‌సభలో మహిళా బిల్లుపై ఈ నెల 17à°¨ చర్చ జరగనుండగా&comma; అదే రోజున అమరావతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించారు&period; రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై&comma; సభా కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేయనున్నారు&period; ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్రంలోని మహిళా ప్రముఖులను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు&period;<&sol;p>&NewLine;<p>బిల్లు ప్రవేశపెట్టే రోజున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు&period; బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీకి&comma; మహిళలకు కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా&comma; నియోజకవర్గ స్థాయిలో విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని కూడా సమావేశంలో చర్చించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..