అమెరికాలో కలకలం రేగిన కాల్పులు

Chicago

Advertisements

&NewLine;<p>అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది&period; ఇల్లినాయ్ రాష్ట్రం‌‌లోని షికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు జరిపిన ఓ దుండగుడు ఏడుగురి ప్రాణాలు తీశాడు&period; కాల్పుల అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసు అధికారులు వెల్లడించారు&period; దుండగుడి కోసం వేట కొనసాగిస్తున్నామని తెలిపారు&period; నగరంలో జోలియట్‌లోని వెస్ట్ ఎకర్స్ రోడ్‌లో ఉన్న 2200 బ్లాక్‌లో ఈ కాల్పుల ఘటన జరిగిందని&comma; నిందితుడిని రోమియో నాన్స్‌ గా గుర్తించామని&comma; ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని వివరించారు&period; రెండు ఇళ్లపై కాల్పులు జరిపాడని&comma; మొత్తం ఏడుగురు మృత్యువాతపడ్డారని జోలియట్‌ పోలీసులు వెల్లడించారు&period;<br>నిందితుడు నాన్స్ కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే నివసిస్తాడని తెలిపారు&period; ఎరుపు రంగు టయోటా క్యామ్రీ కారులో పరారైనట్టు భావిస్తున్నామని&comma; అతడి వద్ద ఆయుధం ఉందని&comma; అతడిని ప్రమాదకరంగా పరిగణించాలని అక్కడి పౌరులను జోలియట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అప్రమత్తం చేసింది&period; నాన్స్‌కు సంబంధించిన సమాచారం&comma; అతడి జాడకు సంబంధించి ఏమైనా తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు&period; కాగా అగ్రరాజ్యం అమెరికా కాల్పుల ఘటనలతో వణికిపోతోంది&period; గణనీయ సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి&period; ఈ ఏడాది మొదటి మూడు వారాల్లోనే 875 తుపాకీ కాల్పుల మరణాలు నమోదయినట్టు గణాంకాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్