సకల రోగాలు నశించిపజేసే సోమనాథుడి వృత్తాంతం!

Somanatha

Advertisements

&NewLine;<p>కార్తీక మాసంలో శివ నామ స్మరణకు ఎంతో విశిష్టత ఉంది&period; కేవలం శివ పంచాక్షరీ మంత్రంతోనే ముక్తిని సాధించవచ్చు అంటారు పురాణ పండితులు&comma; పెద్దలు&period; అయితే పరమేశ్వరుడు జ్యోతిర్లింగాల రూపంలో వెలిశాడు&period; ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకంలో సౌరాష్ట్రే సోమనాథంచ అని ఉండటం అందరికీ తెలిసిందే&period; అయితే ఈ సోమనాథ ఆలయం ఎక్కడుంది&quest;&quest; దాని విశిష్టత ఏంటి&quest;&quest; ఇక్కడ శివుడు వెలసిన కారణం ఏమిటి&quest;&quest; వంటి విషయాలు తెలుసుకుంటే సౌరాష్ట్ర దేశంలో ప్రభాస తీర్ధమున్నది&period; దక్ష ప్రజాపతికి అశ్వని&comma; భరణి మొదలయిన ఇరవై ఏడుమంది పుత్రికలు ఉన్నారు&period; వారిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు దక్షప్రజాపతి&period; వీరందరూ నక్షత్రాలు&period; అయితే చంద్రుడికి తన భార్యలందరిలోకి రోహిణి మీద ఎక్కువ ప్రేమ&comma; అనురాగము కలిగి&comma; ఎక్కువ కాలము ఆమె వద్దనే గడిపేవాడు&period; ఈ విషయం మిగిలిన భార్యలకు బాధాకరంగా మారింది&period; వారంతా ఒక రోజు తండ్రియైన దక్షప్రజాపతి వద్దకు వెళ్లి&comma; చంద్రుడు తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని మొర పెట్టుకున్నారు&period; దక్షప్రజాపతి చంద్రుని పిలిపించి &&num;8220&semi;చంద్రా&excl; నా కుమార్తెలు ఇరవై ఏడుమందిని నీకిచ్చి వివాహం చేశాను&period; నువ్వు అందరినీ సమంగా చూడాలి కదా&excl;&excl; కాని నువ్వు ఒకరిపై ఎక్కువ అనురాగము&comma; వేరొకరిపై తక్కువ అనురాగము చూపకూడదు కదా&period; ఈ ధర్మాన్ని గ్రహించి నీ భార్యలను జాగ్రత్తగా చూసుకో&&num;8221&semi; అన్నాడు&period; సరే అన్నాడు చంద్రుడు&period; ప్రజాపతి మాట కాదనలేక సరే అన్నాడు&period; అంతేకాని తన బుద్ధిమాత్రం మార్చుకోలేదు&period; రోహిణితోనే ఎక్కువకాలం గడుపుతున్నాడు&period; చంద్రుని తీరు మారకపోయేసరికి మిగిలిన భార్యలు దక్ష ప్రజాపతి దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం చెప్పారు&period; దాంతో కోపగించిన ప్రజాపతి చంద్రుని క్షయవ్యాధి పీడితుడుగా మారిపొమ్మని శాపం పెట్టాడు&period; ఆయన శాపం పెట్టగానే చంద్రుడికి క్షయ వ్యాధి సోకింది&period; రోజురోజుకు కృశించిపోతున్నాడు&period; ఇంక భరించలేక బ్రహ్మదేవుని దగ్గరకు పోయి తనను రక్షించమని మొరపెట్టుకున్నాడు&period; విషయం అంతా&period;&period; విన్న బ్రహ్మదేవుడు చంద్రునితో &&num;8220&semi;సారాష్ట్ర దేశంలో ప్రభాస తీర్ధమున్నది&period; అక్కడికి పోయి మృత్యుంజయ మహామంత్రాన్ని జపించు&&num;8221&semi; అని మంత్రోపదేశం కూడా చేశాడు&period; ప్రభాస తీర్ధములో చాలా కాలము మృత్యుంజయ మంత్ర జపం చేశాడు చంద్రుడు&period; చివరకు పరమేశ్వరుడు అనుగ్రహించి అతడికి ప్రత్యక్షమై &&num;8216&semi;నీకే వరం కావాలో కోరుకో&&num;8217&semi; అన్నాడు&period; అప్పుడు చంద్రుడు తన మామగారు తనకిచ్చిన శాపం సంగతి చెప్పి&comma; క్షయ వ్యాధి నుండి తనను రక్షించమని కోరాడు&period; దానికి శంకరుడు &&num;8220&semi;చంద్రా&excl; దక్ష ప్రజాపతి సామాన్యుడు కాదు&period; నవబ్రహ్మలలో ఒకడు&period; కాబట్టి అతడి మాట వ్యర్థం కాదు&period; అలా అని నీ ప్రార్ధన త్రోసి పుచ్చటం న్యాయం కాదు&period; అందుచేత కొంతకాలం నువ్వు వ్యాధి గ్రస్తుడవుగా&comma; మరికొంతకాలము సుఖంగా ఉండు&period; అంటే కృష్ణపక్షములో క్రమక్రమంగా నీ కళలు క్షీణిస్తాయి&period; మళ్ళీ శుక్లపక్షంలో ప్రతిరోజు వృద్ధి పొందుతాయి&period; ఈ రకంగా పౌర్ణమి రోజున పదహారు కళలతో విరాజిల్లు&period; అమావాస్య రోజున కళావిహీనుడివి అవుతావు అన్నాడు&period; అప్పటి నుంచీ చంద్రుడికి వృద్ధి క్షయాలు ఏర్పడినాయి&period; ఆ తరువాత చంద్రుని ప్రార్ధన మీద పరమేశ్వరుడు ప్రభాస తీర్ధములో జ్యోతిర్లింగముగా వెలిశాడు&period; సోముడు అంటే చంద్రుడు&period; అక్కడ సోమునిచే పూజింపబడ్డాడు కాబట్టి సోమనాధుడు అని పిలవబడుతున్నాడు&period; సోమనాధుని అర్చించినవారికి భయంకర రోగములు కూడా పటాపంచలవుతాయి&period; మానసిక బాధలు తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..